గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌... రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేడు టీజ‌ర్ విడుద‌ల‌

Industry:
ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్
కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్
దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను
పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను
జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై ఓ సాంగ్‌ను
చిత్రీక‌రిస్తున్నారు. భాను మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు.
రామ్ జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను నేడు విడుద‌ల 
చేస్తున్నారు.
ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి, ఛార్మి
కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
 సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.
Related News