Gossips

టాక్‌: గీతామాధురిని తాళ్ళతో కట్టేసి....

Industry:

ప్రముఖ తెలుగు సినీ గాయని గీతా మాధురి ఓ సినిమాలో నటిస్తోంది. నటిగా ఆమెకు ఇదే తొలి సినిమా. పలు సినిమాల్లో ఆఫర్‌ వచ్చినా, ఇప్పటిదాకా ఆమె నటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. 'మెట్రో' సినిమాతో తొలిసారిగా నటిగా పరిచయమవుతోన్న గీతామాధురి, ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అంటోంది. 

'మెట్రో' చిత్ర నిర్మాత రజనీ తాళ్ళూరి, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'మెట్రో' చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. గీతామాధురి ఈ సినిమా కోసం ఆలపించిన సాంగ్‌ చాలా ప్రత్యేకమైదనీ, ఆ పాటను ఆమె పాడటమే కాకుండా, అభినయించారని తాళ్ళూరి రజనీ చెప్పుకొచ్చారు. 

ఇక, 'మెట్రో'' సినిమాలో గీతామాధురి స్టిల్స్‌నే మీరు పైన చూస్తున్నది. తాళ్ళతో ఆమెను కట్టేసిన ఫొటో ఒకటి డిఫరెంట్‌గా వుంది. సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తోంది. ఇంకో ఫొటోలో గీతామాధురి పవర్‌ఫుల్‌గా కన్పిస్తోంది. చైన్‌ స్నాచింగ్‌ ఇతివృత్తంతో ఈ 'మెట్రో' రూపొందుతోందట.