విజయ ఢంకా మోగిస్తున్న కమలం

Industry:
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే దూసుకెళ్తోంది. మొత్తం 80 నియోజకవర్గాలుండగా.. 56 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులు 16చోట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇక గత ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన గుజరాత్‌లోనూ భాజపా జోరు కొనసాగుతోంది. గుజరాత్‌లో మొత్తం 26 స్థానాలుండగా.. 22 చోట్ల భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలో భాజపా ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్‌ మొత్తం 28 స్థానాల్లో 22 చోట్ల భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 20 చోట్ల భాజపా ముందంజలో ఉంది. 


Courtesy By : 
https://www.eenadu.net/
Related News