Category: Movie

సైరాలో మిల్కీ బ్యూటీ తమన్నా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పలు చిత్ర పరిశ్రమలనుంచి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా సైరా చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.